మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Anjaneya Mangala Ashtakam – శ్రీ ఆంజనేయ మంగళాష్టకం


గౌరీశివవాయువరాయ అంజనికేసరిసుతాయ చ |
అగ్నిపంచకజాతాయ ఆంజనేయాయ మంగళమ్ || 1 ||

వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే |
పూర్వాభాద్రప్రభూతాయ ఆంజనేయాయ మంగళమ్ || 2 ||

పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ |
కౌండిన్యగోత్రజాతాయ ఆంజనేయాయ మంగళమ్ || 3 ||

సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ |
ఉష్ట్రారూఢాయ వీరాయ ఆంజనేయాయ మంగళమ్ || 4 ||

దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ |
తప్తకాంచనవర్ణాయ ఆంజనేయాయ మంగళమ్ || 5 ||

కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ |
మాణిక్యహారకంఠాయ ఆంజనేయాయ మంగళమ్ || 6 ||

భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే |
సృష్టికారణభూతాయ ఆంజనేయాయ మంగళమ్ || 7 ||

రంభావనవిహారాయ గంధమాదనవాసినే |
సర్వలోకైకనాథాయ ఆంజనేయాయ మంగళమ్ || 8 ||

 


 

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.